News April 3, 2025
KMR: రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు పొడిగింపు

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పథకం ప్రయోజనాలు ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో దరఖాస్తు గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
సిరిసిల్ల: ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి’

వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలనితెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితే జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై చర్చించారు.
News April 4, 2025
పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా అశోక్ కుమార్

పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎన్. అశోక్ కుమార్ నియమితులయ్యారు. కొద్ది రోజుల క్రితం సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ రంగారావు బదిలీపై గుంటూరు వెళ్లడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం సురేశ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
News April 4, 2025
హసీనాను అప్పగించమన్నారు: విక్రమ్ మిస్రీ

మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ప్రధాని మోదీ- బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ, భారత్‌లోకి అక్రమ చొరబాట్లను అడ్డుకునే విషయాలు మహ్మద్ యూనస్‌తో చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.