News April 3, 2025
GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
Similar News
News November 4, 2025
ఆలయాల్లో రద్దీ.. జాగ్రత్తలు

కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తొక్కిసలాటలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు..
*క్యూలలో వ్యతిరేక దిశలో ప్రవేశించకూడదు
*ముందున్న భక్తులను నెట్టకూడదు
*పరుగు తీయడం లేదా తోసుకోవడం చేయొద్దు
*సిబ్బంది సూచనలు పాటించాలి. గుంపులుగా ఉండొద్దు.
*రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు దర్శనం కోసం సహనంతో వేచి ఉండాలి
*తొక్కిసలాట పరిస్థితులు కనిపించగానే దూరంగా వెళ్లాలి
News November 4, 2025
కాజీపేట: ఏటీఎం కార్డు మార్చి.. నగదు కాజేసిన దుండగుడు..!

కాజీపేటలో ఏటీఎం మోసం ఘటన కలకలం రేపింది. రైల్వే ఉద్యోగి దావ కల్పన యూనియన్ బ్యాంకు ఏటీఎంలో రూ.46 వేల డిపాజిట్ చేస్తుండగా ఓ దుండగుడు సాయం చేస్తున్నట్లు నటించి ఆమె కార్డును మార్చి వేరే కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన కొద్దిసేపట్లోనే రూ.45 వేలు డ్రా అయినట్లు మెసేజీలు రావడంతో ఆమె షాక్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
News November 4, 2025
చిత్తూరు విద్యార్థులకు అరుదైన అవకాశం

చిత్తూరులోని ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు N.లాస్య, M.రమాకాంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. వీరిద్దరూ సైన్స్‌లో ప్రతిభ చూపడంతో “సైన్స్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్”కు సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 6 నుంచి ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి వివిధ కార్యాలయాలను చూపిస్తారు. పరిశోధనాసక్తి, దేశభక్తి పెంపొందించేలా టూర్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు.


