News April 3, 2025

GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

image

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

Similar News

News April 4, 2025

హసీనాను అప్పగించమన్నారు: విక్రమ్ మిస్రీ

image

మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ప్రధాని మోదీ- బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ, భారత్‌లోకి అక్రమ చొరబాట్లను అడ్డుకునే విషయాలు మహ్మద్ యూనస్‌తో చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో రూ.150 కోట్లతో ఉపాధి పనులు

image

చిత్తూరు జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద రూ.150 కోట్లతో మెటీరీయల్ కాంపొనెంట్ పనులను చేపట్టనున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. జిల్లా సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అభివృద్ధి పనుల మంజూరులో MLA, MLC అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

News April 4, 2025

MBNR: ముస్లిం మహిళల మేలు కోసమే వక్ఫ్ బోర్డు: ఎంపీ 

image

భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025కు లోక్ సభ, రాజ్యసభల్లో రాజముద్ర పడిందన్నారు. పేద ముస్లింలు, ముస్లిం మహిళల మేలు కోసం, వక్ఫ్ బోర్డులో పారదర్శకత కోసం ఈ సవరణ బిల్లు ఎంతో దోహదపడుతుందన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలను అమలుపరుస్తూ దేశ సంక్షేమం కోసం బీజేపీ ముందుంటుందని అనడానికి ఈ బిల్లు ఆమోదమే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.

error: Content is protected !!