News April 3, 2025
WGL: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

హనుమకొండ పోస్టల్ కాలనీలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ఇంటిపై సుబేదారి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్స్, రూ.2,450 నగదు స్వాధీనపరచుకున్నామని ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
Similar News
News January 15, 2026
వికారాబాద్: అంగన్వాడీల్లో ఇన్ని ఖాళీ పోస్టులా?

VKB జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా, టీచర్ల కొరత వేధిస్తోంది. కొడంగల్ ప్రాజెక్టులో 234 కేంద్రాలు ఉండగా.. 73 ఆయా, 14 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మర్పల్లి 148 కేంద్రాలు ఉండగా.. 41 ఆయా, 30 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిగి ప్రాజెక్టులో 235 కేంద్రాలు ఉండగా.. 112 ఆయా, 21 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వికారాబాద్ ప్రాజెక్టులో 233 కేంద్రాలు ఉండగా.. 82 ఆయా, 18 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News January 15, 2026
NLG: వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరేనో!

మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో వర్గపోరు పార్టీల్లో గందరగోళం సృష్టిస్తోంది. BJP పుంజుకుంటున్న తరుణంలో వర్గపోరు నేతలకు తలనొప్పిగా మారగా, కాంగ్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, DCC అధ్యక్షుడు పున్నా కైలాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది. మరోవైపు కార్పొరేషన్ తమదే అంటూ BRS వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో విజయం ఎవరిదో కామెంట్ చేయండి.
News January 15, 2026
చిత్తూరు ఎస్పీకి నోటీసులు

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.


