News April 3, 2025

తిరుపతి మార్గంలో తప్పిన పెనుప్రమాదం

image

భాకరాపేట ఘాట్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొంత మంది ప్రయాణికులతో మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సు తిరుపతికి బయల్దేరింది. ఘాట్ రోడ్డులోకి రాగానే బస్ బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత చాకచక్యంగా రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణనష్టం తప్పింది.

Similar News

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో రూ.150 కోట్లతో ఉపాధి పనులు

image

చిత్తూరు జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద రూ.150 కోట్లతో మెటీరీయల్ కాంపొనెంట్ పనులను చేపట్టనున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. జిల్లా సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అభివృద్ధి పనుల మంజూరులో MLA, MLC అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో ప్రత్యేక అధికారుల నియామకం

image

వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం డివిజన్‌కు ఒక్కో అధికారిని నియమిస్తూ చిత్తూరు డీఎంహెచ్ఓ సుధారాణి ఉత్తర్వులు జారీ చేశారు. జీడీ నెల్లూరు డివిజన్‌కు డీఐఓ హనుమంతరావు, పలమనేరుకు టీబీ అధికారి వెంకటప్రసాద్, కుప్పంకు గంగాదేవి, చిత్తూరుకు అనుష, నగరికి నవీన్ తేజ్, పూతలపట్టుకు గిరి, పుంగనూరుకు అనిల్ కుమార్‌ను నియమించారు.

News April 4, 2025

Dy.CM పవన్‌కు భూమన సవాల్

image

తిరుమల లడ్డూ నాణ్యత తమ ప్రభుత్వంలోనే పెరిగిందని వైసీపీ నేత భూమన అన్నారు. ఈ అంశంపై కూటమి నేతలు తమపై కావాలనే తప్పుడు ప్ర చారాలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో వీఐపీ దర్శనాల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఆరోపించారు. మంత్రి లోకేశ్ పీఏ నుంచి అధికంగా లెటర్లు వస్తున్నాయన్నారు. వైసీసీ హయాంలో తప్పు జరిగిందో లేక కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగాయో చర్చకు తాము సిద్ధం అంటూ Dy.CM పవన్‌కు ఆయన సవాల్ విసిరారు.

error: Content is protected !!