News April 3, 2025

SRPT: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic.వెబ్‌సైట్‌లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. 

Similar News

News April 9, 2025

కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలి హత్య

image

కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మ హత్యకు గురయ్యారు. బిహార్‌లోని గయాలో భర్త రమేశ్ నాటు తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. నిన్న రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంపతుల మధ్య తలెత్తిన గొడవలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి ఇంకా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 9, 2025

సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ కార్యదీక్షతో విధులు నిర్వర్తించి, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్‌లో శ్రీ కోదండరామస్వామివారి కళ్యాణోత్సవ విధుల నిర్వహణపై ఒక్కరోజు శిక్షణలో భాగంగా వారికి కేటాయించిన అంశాల్లో పనుల పురోగతిపై సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్ధవంతంగా పూర్తి చేయాలన్నారు.

News April 9, 2025

SMలో మహిళలకు వేధింపులు.. CMకు విజయశాంతి విజ్ఞప్తి

image

సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్స్ మహిళలకు బాధను, పనిచేయలేని పరిస్థితులను కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహిళలు చేసే కంప్లైంట్‌పై తక్షణమే స్పందించి చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీనిద్వారా అరెస్టులు, ఇతర చర్యలు తీసుకున్నట్లయితే మహిళా లోకానికి ఆత్మస్థైర్యం, విశ్వాసం లభిస్తుంది’ అని సీఎం రేవంత్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!