News April 3, 2025

సిరిసిల్ల: వరుస దొంగతనాలు.. జాగ్రత్త..!

image

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇటీవల వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మార్చి 15 శనివారం ఇల్లంతకుంట మండలం రేపాకలోని ఎల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు గుడి తలుపులు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. మార్చి 28 శుక్రవారం బోయినపల్లి మండలం కొదురుపాకలో సట్టా జలజ ఇంట్లో దొంగతనం జరిగింది. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరించారు.

Similar News

News April 4, 2025

పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా అశోక్ కుమార్

image

పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎన్. అశోక్ కుమార్ నియమితులయ్యారు. కొద్ది రోజుల క్రితం సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ రంగారావు బదిలీపై గుంటూరు వెళ్లడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం సురేశ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. 

News April 4, 2025

హసీనాను అప్పగించమన్నారు: విక్రమ్ మిస్రీ

image

మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ప్రధాని మోదీ- బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ, భారత్‌లోకి అక్రమ చొరబాట్లను అడ్డుకునే విషయాలు మహ్మద్ యూనస్‌తో చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో రూ.150 కోట్లతో ఉపాధి పనులు

image

చిత్తూరు జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద రూ.150 కోట్లతో మెటీరీయల్ కాంపొనెంట్ పనులను చేపట్టనున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. జిల్లా సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అభివృద్ధి పనుల మంజూరులో MLA, MLC అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

error: Content is protected !!