News April 3, 2025

‘ఉప్పల్’కు బీసీసీఐ నో ఛాన్స్

image

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంపై బీసీసీఐ చిన్న చూపు చూసింది. ఈ ఏడాది ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహణకు మొగ్గు చూపలేదు. నిన్న విడుదల చేసిన వెస్టిండీస్, సౌతాఫ్రికా సిరీస్‌ల షెడ్యూల్‌లో ఉప్పల్ స్టేడియం పేరే లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి SAతో మూడో వన్డేకు విశాఖపట్నం మాత్రమే ఆతిథ్యమివ్వనున్నట్లు పేర్కొంది. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్ ఐపీఎల్ మ్యాచులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Similar News

News April 4, 2025

309 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 25 నుంచి మే 24 వరకు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసినవారు అర్హులు. జీతం రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వయసు 27 ఏళ్లు కాగా రిజర్వేషన్ల మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 4, 2025

KGBVల్లో ప్రవేశాలు.. ఈ నెల 11 వరకు ఛాన్స్

image

AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 7, 8, 9, 10, ఇంటర్ సెకండియర్‌లో మిగిలిన సీట్లకు అప్లై చేసుకోవాలని సమగ్రశిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. అనాథలు, డ్రాపౌట్స్, SC, ST, BC, మైనార్టీ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in/

News April 4, 2025

గతేడాది అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..

image

గత ఆర్థిక సంవత్సరం ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన వెహికిల్‌గా మారుతీ సుజుకీ వేగన్-R నిలిచింది. 1,98,451 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మెుత్తం 33.7 లక్షల యూనిట్లు సేల్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆటో మెుబైల్ మార్కెట్‌లో Wagon-R 4th జెనరేషన్ వెహికిల్ 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

error: Content is protected !!