News April 3, 2025
VKB: పెద్దేముల్‌లో మిస్టరీగా మహిళ మృతి!

పెద్దేముల్ మండల కేంద్రంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు కాలువలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. సదరు మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. DSP బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందం వివరాలు సేకరించారు. మహిళ ముఖం, చేతిని కాల్చివేసినట్లు గుర్తించారు. మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Similar News
News April 4, 2025
గతేడాది అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..

గత ఆర్థిక సంవత్సరం ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన వెహికిల్‌గా మారుతీ సుజుకీ వేగన్-R నిలిచింది. 1,98,451 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మెుత్తం 33.7 లక్షల యూనిట్లు సేల్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆటో మెుబైల్ మార్కెట్‌లో Wagon-R 4th జెనరేషన్ వెహికిల్ 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
News April 4, 2025
అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి: మంత్రి

అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, టెక్స్టైల్ పార్క్ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల MLA అధ్యక్షతన జరిగిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇండస్ట్రీల్లో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
News April 4, 2025
కృష్ణా జిల్లా డీసీహెచ్ఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన శేషు కుమార్

కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS)గా నియమితులైన శేషు కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా DCHSగా పనిచేస్తున్న శేషు కుమార్ ఇటీవల జిల్లాకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ డీకే బాలాజీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.