News April 3, 2025
సత్యవేడు MLAపై TDP అధిష్ఠానానికి ఫిర్యాదు

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి టీడీపీ నాయకులు షాక్ ఇచ్చారు. ఆయన తీరుతో పార్టీ నష్టపోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తూ తమను అణగదొక్కుతున్నారని వాపోయారు. కొత్త ఇన్‌ఛార్జ్‌ను ప్రకటిస్తేనే అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే హేమలతకు సత్యవేడు బాధ్యతలు అప్పగించాలని పలువురు కోరినట్లు సమాచారం.
Similar News
News April 4, 2025
పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా అశోక్ కుమార్

పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎన్. అశోక్ కుమార్ నియమితులయ్యారు. కొద్ది రోజుల క్రితం సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ రంగారావు బదిలీపై గుంటూరు వెళ్లడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం సురేశ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
News April 4, 2025
హసీనాను అప్పగించమన్నారు: విక్రమ్ మిస్రీ

మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ప్రధాని మోదీ- బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ, భారత్‌లోకి అక్రమ చొరబాట్లను అడ్డుకునే విషయాలు మహ్మద్ యూనస్‌తో చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
News April 4, 2025
చిత్తూరు జిల్లాలో రూ.150 కోట్లతో ఉపాధి పనులు

చిత్తూరు జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద రూ.150 కోట్లతో మెటీరీయల్ కాంపొనెంట్ పనులను చేపట్టనున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. జిల్లా సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అభివృద్ధి పనుల మంజూరులో MLA, MLC అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.