News April 3, 2025
NTR: రాజధాని అమరావతిలో పర్యటించిన సింగపూర్ బృందం

సింగపూర్ బృందం బుధవారం అమరావతిలో పర్యటించింది. ఈ బృందానికి సిఆర్డిఏ అధికారులు రాజధానిలో చేపట్టిన పలు భవన నిర్మాణాల గురించి వివరించారు. ఉండవల్లి వద్ద వరద నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన పంపింగ్ స్టేషన్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికలను సిఆర్డిఏ అధికారులు వివరించారు. అనంతరం సీడ్ యాక్సిస్ రహదారి, మంత్రులు, IAS అధికారుల బంగ్లాల పనులలో పురోగతిని సింగపూర్ ప్రతినిధులు పరిశీలించారు.
Similar News
News April 4, 2025
KGBVల్లో ప్రవేశాలు.. ఈ నెల 11 వరకు ఛాన్స్

AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 7, 8, 9, 10, ఇంటర్ సెకండియర్‌లో మిగిలిన సీట్లకు అప్లై చేసుకోవాలని సమగ్రశిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. అనాథలు, డ్రాపౌట్స్, SC, ST, BC, మైనార్టీ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in/
News April 4, 2025
కృష్ణా: AR కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం

విధి నిర్వహణలో మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు భార్య వీరమల్లు రాజేశ్వరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. ఆమెను జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఎస్పీ ఆర్. గంగాధరరావు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.
News April 4, 2025
మేడ్చల్: ‘సిగరెట్ తాగనీకి టైం లేనట్టుంది’

స్కూటీపై వెళ్లే ఈ అన్నకు సిగరెట్ తాంగేందుకు నిమిషం టైం లేనట్టుందని పలువురు విమర్శిస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రోడ్డులో స్కూటీపై ఓ చేతితో సిగరెట్ మరో చేతితో వేగంగా డ్రైవ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి ఫోటో క్లిక్ మనిపించారు. సిగరెట్ పదేళ్లకు ఆరోగ్యం పాడు చేస్తే, ఈ డ్రైవింగ్ క్షణకాలంలో ప్రాణం తీస్తుందని పోలీసులు హెచ్చరించారు.