News April 3, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు శుభవార్త

శ్రీకాకుళం, పలాస మీదుగా హైదరాబాద్(HYD)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నం.07165 HYD- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
Similar News
News January 8, 2026
ట్రాఫిక్ సమస్య రానీయకూడదు: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రానీయకూడదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పరిసరాలను పరిశీలించారు. 80 అడుగుల రహదారిలో మిల్లు జంక్షన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలను గుర్తించారు. భక్తులకు దర్శనాలకు రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సిబ్బందికి సూచించారు. రద్దీ నియంత్రణకు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.
News January 8, 2026
SKLM: నలుగురు ఉద్యోగులకు పదోన్నతి పత్రాలు అందజేసిన చైర్‌పర్సన్

జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు రికార్డు సహాయకులుగా పదోన్నతి కల్పిస్తూ జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ గురువారం నియామక పత్రాలు అందజేశారు. తన అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.జ్యోతికుమారి (అమలపాడు), కె.పావని (బ్రాహ్మణతర్ల), హెచ్. శాంతిలక్ష్మి (బోరుభద్ర) కే ప్రసాదరావు (గొప్పిలి) పదోన్నతి పొందారు.
News January 8, 2026
SKLM: అంగన్వాడీలో చిన్నారులకు కొత్త మెనూ

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న మెనూలో స్వల్పమార్పులు జరిగాయి. కేంద్రాల్లో చిన్నారులకు మంగళ, శనివారాలు ఉదయం ఉడకబెట్టిన శనగలు, మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్‌రైస్ పెట్టాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా అన్నం, ఆకుకూరలు, పప్పు, కూరగాయలు, పాలును అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని 16 ప్రాజెక్టుల్లోని 3,562 కేంద్రాల్లో కొత్త మెనూ అమలులోకి వచ్చింది.


