News April 3, 2025
కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య: SI

రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన పతివాడ కొత్తయ్య (65) తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ ప్రసాద్ వివరాల మేరకు.. కొత్తయ్య కుమారుడు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News April 4, 2025
విజయనగరం జిల్లాలో నామినేటెడ్ పోస్టులు వీరికే

విజయనగరం జిల్లాలో పలువురు నాయకులను నామినేటెడ్ పదవులు వరించాయి. విజయనగరం, గజపతినగరం, రాజాం మార్కెట్ కమిటీ ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాజాం ఏఎంసీ ఛైర్‌పర్సన్‌గా పొగిరి కృష్ణవేణి(జనసేన), గజపతినగరం మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పీ.వీ.వీ గోపాలరాజు(టీడీపీ), విజయనగరం ఏఎంసీ ఛైర్మన్‌గా కర్రోతు వెంకటనర్శింగరావుకు(టీడీపీ) అవకాశం ఇచ్చింది.
News April 4, 2025
సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.
News April 4, 2025
విజయనగరంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్

విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్‌ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.