News April 3, 2025
సాయి సుదర్శన్ పరుగుల ప్రవాహం.. ఓ లుక్కేయండి!

35, 11, 20, 65*, 14, 22, 62*, 53, 19, 20, 47, 43, 96, 45, 37, 45, 33, 31, 35, 12, 31, 65, 84*, 6, 103, 74, 63, 49.. GT ఓపెనర్ సాయి సుదర్శన్ గత ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు ఇవి. IPLలో 28 ఇన్నింగ్స్ తర్వాత అత్యధిక పరుగులు(1220) చేసిన లిస్టులో షాన్ మార్ష్ తర్వాత స్థానంలో ఉన్నారు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడుతున్న ఇతను.. 2022లో GT ట్రోఫీ గెలవడంలోనూ కీలకపాత్ర పోషించారు.
Similar News
News April 4, 2025
309 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 25 నుంచి మే 24 వరకు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసినవారు అర్హులు. జీతం రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వయసు 27 ఏళ్లు కాగా రిజర్వేషన్ల మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <
News April 4, 2025
KGBVల్లో ప్రవేశాలు.. ఈ నెల 11 వరకు ఛాన్స్

AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 7, 8, 9, 10, ఇంటర్ సెకండియర్‌లో మిగిలిన సీట్లకు అప్లై చేసుకోవాలని సమగ్రశిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. అనాథలు, డ్రాపౌట్స్, SC, ST, BC, మైనార్టీ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in/
News April 4, 2025
గతేడాది అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..

గత ఆర్థిక సంవత్సరం ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన వెహికిల్‌గా మారుతీ సుజుకీ వేగన్-R నిలిచింది. 1,98,451 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మెుత్తం 33.7 లక్షల యూనిట్లు సేల్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆటో మెుబైల్ మార్కెట్‌లో Wagon-R 4th జెనరేషన్ వెహికిల్ 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది.