News April 3, 2025

భద్రాద్రి జిల్లాకు వర్ష సూచన

image

భద్రాద్రి జిల్లాలోని ఈ నెల 5 వరకు పలు చోట్ల ఈదురు గాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని వెల్లడించింది. దీంతో జిల్లాలో నమోదయ్యే 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News April 4, 2025

KGBVల్లో ప్రవేశాలు.. ఈ నెల 11 వరకు ఛాన్స్

image

AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 7, 8, 9, 10, ఇంటర్ సెకండియర్‌లో మిగిలిన సీట్లకు అప్లై చేసుకోవాలని సమగ్రశిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. అనాథలు, డ్రాపౌట్స్, SC, ST, BC, మైనార్టీ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in/

News April 4, 2025

కృష్ణా: AR కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం 

image

విధి నిర్వహణలో మృతిచెందిన ఏ‌ఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు భార్య వీరమల్లు రాజేశ్వరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. ఆమెను జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఎస్పీ ఆర్. గంగాధరరావు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. 

News April 4, 2025

మేడ్చల్: ‘సిగరెట్ తాగనీకి టైం లేనట్టుంది’

image

స్కూటీపై వెళ్లే ఈ అన్నకు సిగరెట్ తాంగేందుకు నిమిషం టైం లేనట్టుందని పలువురు విమర్శిస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రోడ్డులో స్కూటీపై ఓ చేతితో సిగరెట్ మరో చేతితో వేగంగా డ్రైవ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి ఫోటో క్లిక్ మనిపించారు. సిగరెట్ పదేళ్లకు ఆరోగ్యం పాడు చేస్తే, ఈ డ్రైవింగ్ క్షణకాలంలో ప్రాణం తీస్తుందని పోలీసులు హెచ్చరించారు.

error: Content is protected !!