News April 3, 2025
రూమర్స్‌పై ‘ది ప్యారడైజ్’ టీమ్ ఆగ్రహం

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌తోనే సంచలనం సృష్టించింది. అయితే ఫండింగ్ సమస్య, స్క్రిప్ట్ పట్ల నాని అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్ వచ్చాయి. దీనిపై మూవీ టీమ్ ‘గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి’ అంటూ ఘాటుగా స్పందించింది. ‘మూవీ రైట్ ట్రాక్‌లో ఉంది. TFIలో గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. త్వరలోనే మీ ముందుకు వస్తాం’ అని ట్వీట్ చేసింది.
Similar News
News April 4, 2025
గతేడాది అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..

గత ఆర్థిక సంవత్సరం ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన వెహికిల్‌గా మారుతీ సుజుకీ వేగన్-R నిలిచింది. 1,98,451 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మెుత్తం 33.7 లక్షల యూనిట్లు సేల్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆటో మెుబైల్ మార్కెట్‌లో Wagon-R 4th జెనరేషన్ వెహికిల్ 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
News April 4, 2025
పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని తాగి..

అలోవేరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి 14 ఏళ్ల బాలిక మరణించింది. బెంగళూరుకు చెందిన దీపాంజలికి అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్ తీసుకొని తాగేసింది. అయితే అంతకుముందే అందులో జ్యూస్ అయిపోవడంతో పేరెంట్స్ ఆ డబ్బాలో పురుగుల మందు లిక్విడ్ పోసి పెట్టారు. అది గమనించకపోవడంతో దీపాంజలి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
News April 4, 2025
రజినీకాంత్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్!

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీని ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘కూలీ ఫ్రమ్ ఆగస్టు 14’ అన్న హాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్, పూజా హెగ్డే తదితరులు నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.