News April 3, 2025

జనగామ: దరఖాస్తుల ఆహ్వానం 

image

మహాత్మ జ్యోతిబాఫూలే విదేశీ విద్యా నిధి (బీసీ ఓవర్సీస్) పథకం కింద జిల్లాలోని బీసీ, ఈ బీసీ విద్యార్థులు విదేశాలలో చదువుకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు అప్లై చేసుకోవాలన్నారు. వివరాలకు www.telanganaepass.cgg.gov వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News April 4, 2025

జోగులాంబ గద్వాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

image

✍️ధరూర్:నూతన పోలీస్ స్టేషన్‌కు DGP భూమి పూజ ✍️గద్వాల:గోడ పత్రికలను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ✍️మల్దకల్ :విగ్రహాల ప్రతిష్టాపనకు అంకురార్పణ ✍️ఇటిక్యాల:మూగజీవాలకు తీవ్రమైన తాగునీటి సమస్య ✍️అలంపూర్‌లో యాక్సిడెంట్ ✍️వడ్డేపల్లి:కలుకుంట్ల గ్రామంలో NSS క్యాంపు ✍️మహిళా డిగ్రీ కాలేజీలో మాదకద్రవ్యాలపై అవగాహన ✍️సమగ్ర ప్రణాళికను రూపొందించాలి: కలెక్టర్ ✍️రాజోలి:ఇందిరమ్మ ఇంటి నమూనాకు మార్కింగ్

News April 4, 2025

కాకినాడ జిల్లాలో పిడుగుపాటు హెచ్చరికలు జారీ

image

వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కాకినాడ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. శుక్రవారం ఈ మేరకు ప్రజల ఫోన్లకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, పెదపూడి తదితర ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ సందేశంలో పేర్కొంది.

News April 4, 2025

‘వక్ఫ్’ తరహాలోనే పార్లమెంటులో సుదీర్ఘ చర్చలివే!

image

వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలు, రాజ్యసభలో 17 గంటల పాటు చర్చ జరిగింది. ఇదొక అరుదైన విషయమని RS ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తెలిపారు. అయితే గతంలోనూ పార్లమెంటులో మారథాన్ చర్చలు జరిగాయి. LSలో స్టేట్ ఆఫ్ అవర్ డెమొక్రసీపై 20.8గంటలు, రైల్వే బడ్జెట్‌పై 1993లో 18.35గంటలు, 1988లో 19.04గంటలు, మైనార్టీల భద్రత బిల్లుపై 17.25గంటలు, 1981లో RSలో ఎసెన్షియల్ సర్వీసెస్ బిల్లుపై 16.88గంటల చర్చ జరిగింది.

error: Content is protected !!