News April 3, 2025

గంభీరావుపేట: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

image

గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బుధవారం బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శివంది దేవయ్య(47) తన వ్యవసాయ పొలం వద్ద బావిని పూడిక తీసేందుకు పనులు చేపట్టాడు. పనులు ఎక్కడ వరకు వచ్చాయి అనే క్రమంలో తొంగి చూసే ప్రయత్నం చేయగా అందులో కాలు జారిపడి బావిలో పడడంతోతీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు దేవయ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ రాత్రి మృతిచెందాడు.

Similar News

News February 24, 2026

రక్షణ రంగ అభివృద్ధికి ఏపీ కీలకం: జి. సతీష్ రెడ్డి

image

విశాఖ డిఫెన్స్ స్టార్టప్ సదస్సులో రక్షణ శాస్త్రవేత్త జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తీరప్రాంతం, పారిశ్రామిక వసతులు రాష్ట్రానికి బలమని, స్టార్టప్స్ భాగస్వామ్యంతో అధునాతన పరికరాల తయారీ సాధ్యమని చెప్పారు. సముద్ర భద్రతే దేశ ఆర్థిక భద్రతకు మూలస్తంభమని, స్వదేశీ సాంకేతికతతో ఇండో-పసిఫిక్‌లో భారత ప్రయోజనాలను కాపాడవచ్చని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా పేర్కొన్నారు.

News February 24, 2026

జింబాబ్వే ఘోర ఓటమి

image

T20 WCలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఘోరంగా ఓడిపోయింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ZIM 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఏ దశలోనూ ఛేదన దిశగా సాగలేదు. ముగ్గురు డకౌట్ అయ్యారు. చివర్లో ఇవాన్స్(43) కాసేపు మెరుపులు మెరిపించారు. మోతీ 4, హొసీన్ 3, ఫోర్డె 2, హోల్డర్ ఒక వికెట్ తీశారు.

News February 24, 2026

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్

image

TG: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1.2 కోట్ల పరిహారం ఇవ్వనుంది. 60 ఏళ్లలోపు సహజ మరణానికి ₹10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. 7.57 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తించనుంది. క్యాష్‌లెస్ EHS అమలు చేయాలని నిర్ణయించింది.