News April 3, 2025
సిరిసిల్ల జిల్లాలో తగ్గుముఖం పట్టిన ఎండ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. వీర్నపల్లి 36.9 °c, గంభీరావుపేట 36.8°c, కోనరావుపేట 36.3, సిరిసిల్ల 36.2, ఇల్లంతకుంట 36.0°c, బోయిన్పల్లి 36.1°c, చందుర్తి 35.2°c, రుద్రంగి 35.0 డిగ్రీలుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం పలు మండలాలలో మేఘాలు కమ్ముకుపోయి చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి.
Similar News
News September 15, 2025
విశాఖలో ఆరుగురు సీఐలు బదిలీ

విశాఖ సిటీలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ CP శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. MVP సీఐ మురళి, వెస్ట్ జోన్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావును రేంజ్‌కు సరెండర్ చేశారు. ద్వారక సర్కిల్ ట్రాఫిక్ CI కేఎన్వి ప్రసాద్‌ను ఎంవీపీకి, పోలీస్‌కంట్రోల్ రూమ్ సీఐ ఎన్.విప్రభాకర్‌ను ద్వారకా ట్రాఫిక్‌కి బదిలీ చేశారు. సిటీ వీఆర్ సీఐ చంద్రమౌళిని వెస్ట్ జోన్ క్రైమ్‌కు. సిటీ విఆర్ భాస్కరరావును కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేశారు.
News September 15, 2025
విశాఖ మెట్రోరైలు నిర్మాణం ఎప్పుడో?

విశాఖ మెట్రో ప్రాజెక్టుకు ఈనెల 12న టెండర్లకు గడువు ముగిసినా ఒక్క సంస్థ కూడా ఆసక్తి చూపకపోవడంతో అక్టోబరు 7వరకు గడువు పొడిగించారు. ప్రాజెక్టు వయబిలిటీపై బిడ్డర్లకు పలు అనుమానాలు ఉండటమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. తొలి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,250 కోట్లు. మరోవైపు HYD మెట్రోలో ఎదురైన ఇబ్బందులతో ఇకపై మెట్రో ప్రాజెక్టులు చేయమన్న L&Tప్రకటన కూడా ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్నారు.
News September 15, 2025
సంగారెడ్డి: ప్రజా పాలన వేడుకలకు హాజరు కానున్న మంత్రి

సంగారెడ్డి పరేడు గ్రౌండ్‌లో ఈనెల 17న నిర్వహించే ప్రజా పాలన వేడుకలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరుకానున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని అన్నారు. వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.