News April 3, 2025

RCBని దెబ్బకొట్టిన సిరాజ్

image

ఏడేళ్ల పాటు ఆర్సీబీ తరఫున ఆడిన సిరాజ్ (GT) నిన్న మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆ జట్టునే దెబ్బ తీశారు. చిన్నస్వామి స్టేడియంలో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశారు. 4 ఓవర్లలో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. ఆఖర్లో జోరు మీదున్న లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. మెగా వేలంలో ఆర్సీబీ సిరాజ్‌ను రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆయనే ఆ జట్టుపై MOMగా నిలవడం విశేషం.

Similar News

News April 5, 2025

TODAY HEADLINES

image

AP: బర్డ్‌ ఫ్లూపై ఆందోళన వద్దు: CM చంద్రబాబు
TG: జీవన ప్రమాణాలు పెరిగే విధంగా విద్యావ్యవస్థ ఉండాలి: CM రేవంత్
వక్ఫ్ బిల్లుతో అన్యాయం, అవినీతి అంతం: అమిత్ షా
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
AP: తల్లిపై కేసు వేసిన కొడుకుగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: షర్మిల
AP: నా పోటీ సీఎం చంద్రబాబుతోనే: లోకేశ్
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. రూ.11Cr సంపద ఆవిరి

News April 5, 2025

BREAKING: APPSC గ్రూప్ 2 ఫలితాలు విడుదల

image

AP: ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రిజల్ట్స్‌తోపాటు ఎగ్జామ్ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేసింది. కీని APPSC వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సెలెక్ట్ చేసింది. స్పోర్ట్స్ కోటాతో సహా మొత్తం 2,517 మందిని ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వీరందరికి త్వరలోనే కాల్ లెటర్లు పంపనుంది.

News April 5, 2025

IPL: ఉత్కంఠపోరులో గెలుపెవరిదంటే..

image

ముంబైతో జరిగిన ఉత్కంఠ పోరులో LSG విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో నమన్ ధీర్(24 బంతుల్లో 46), సూర్యకుమార్(43 బంతుల్లో 67) పోరాడినా ఫలితం లేకపోయింది. LSG బౌలర్లలో శార్దూల్, ఆకాశ్, ఆవేశ్, దిగ్వేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

error: Content is protected !!