News April 3, 2025
అన్నపురెడ్డిపల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం

భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దిరెడ్డిగూడెంలో షార్ట్ సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధమైయ్యాయి. ఈ ప్రమాదంలో మంటలు అంటుకొని ఒకరు మృతి చెందారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 5, 2025
BREAKING: APPSC గ్రూప్ 2 ఫలితాలు విడుదల

AP: ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రిజల్ట్స్‌తోపాటు ఎగ్జామ్ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేసింది. కీని APPSC వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సెలెక్ట్ చేసింది. స్పోర్ట్స్ కోటాతో సహా మొత్తం 2,517 మందిని ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వీరందరికి త్వరలోనే కాల్ లెటర్లు పంపనుంది.
News April 5, 2025
MDCL: జిల్లాలో 17.3 లక్షల మందికి రేషన్ బియ్యం..!

మేడ్చల్ జిల్లాకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన మరో రిపోర్టును Way2News సేకరించింది. నేటి వరకు జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 5,30,590కు చేరిందని, దీంతో 17,37,600 మందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందుతుందని ఇన్‌ఛార్జి DCSO సుగుణ బాయి తెలిపారు. కులగణన ప్రకారం 12,243 దరఖాస్తులు రాగా, తాజాగా 6,818 రేషన్ కార్డులు జారీ అయ్యాయి.
News April 5, 2025
HYD: శ్రీరామనవమి బందోబస్తుపై CP మీటింగ్

HYD కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్రపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీరామనవమి శోభాయాత్ర ప్రాధాన్యతను వివరించి, కొత్తగా చేరిన అధికారులకు బందోబస్తు ఏర్పాట్ల గురించి వివరంగా వివరించారు. అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకుని వారి సందేహాలను నివృత్తి చేశారు.