News April 3, 2025

నిజామాబాద్: జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. బుధవారం గోపనపల్లెలో 37.6℃ నమోదైంది. వైల్పూర్ 37.3, మోస్రా 37.2, పెర్కిట్ 37, కోటగిరి 36.8, వేంపల్లి 36.6, యర్గట్ల, యడపల్లి 36.5, లక్ష్మాపూర్ 36.3, మల్కాపూర్ 36.2, ముప్కాల్, నిజామాబాద్ 36.1, ఆలూరు, బాల్కొండ 36, మెండోరా, భీంగల్, ఇస్సాపల్లి 35.9, మగ్గిడి 35.7℃ నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి.

Similar News

News April 4, 2025

NZB: సన్న బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి: మంత్రి

image

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సన్న బియ్యం పంపిణీపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు.

News April 4, 2025

నిజామాబాద్‌లో ముస్లింల నిరసన

image

వక్ఫ్​ బోర్డు సవరణ బిల్లుపై నిజామాబాద్ నగరంలోని నెహ్రూపార్క్ వద్ద ముస్లింలు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో వక్ఫ్​ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చి ముస్లింల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ(ACP) రాజా వెంకట్​ ​రెడ్డి, 1వ టౌన్​ (SHO) రఘుపతి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు.

News April 4, 2025

NZB: అధికారులపై కలెక్టర్ అసంతృప్తి

image

రెంజల్ మండలం దూపల్లి, దండిగుట్ట కొనుగోలు కేంద్రాలలోని రిజిస్టర్లలో వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టర్లలో విధిగా వివరాలు నమోదు చేయాలని రైతులకు ధాన్యం రకం, ఎంత పరిమాణంలో వారి నుంచి ధాన్యం సేకరించారు. తదితర వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని ఆదేశించారు. ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు.

error: Content is protected !!