News April 3, 2025
NLG: రాజీవ్ యువ వికాసానికి ఇక నేరుగా దరఖాస్తులు!

రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా SC, ST, BC, మైనార్టీ శాఖల పరిధిలోని 8 కార్పొరేషన్ల పరిధిలో రుణాలు పొందేందుకు ఇక నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే సర్వర్ ఇబ్బందులతో పాటు పలు విషయాలలో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News February 26, 2026
నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షల ఏర్పాట్లపై న్యూఢిల్లీ నుంచి NTA డైరెక్టర్ జనరల్ రాజేష్ లఖని, రాష్ట్ర విద్యా కమిషనర్ భరత్ గుప్తాతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు, భద్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
News February 26, 2026
SVU: ప్రొఫెసర్‌కు ప్రఖ్యాత అవార్డు

SVU వైరాలజీ విభాగ ఆచార్యులు, డీన్, రీసెర్చ్ & డెవలప్‌మెంట్ జి. నరసింహకు న్యూఢిల్లీలోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అకాడమీ (NESA) అవార్డు–2025ను ప్రదానం చేసినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. NESA ఫెలోషిప్ అవార్డు ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధన, ఆవిష్కరణ శాస్త్రీయ విభాగాలలో పురోగతికి చేసిన అత్యుత్తమ కృషికి ఇస్తారు. నరసింహ ఆధునిక వైద్యంలో నానోటెక్నాలజీ అనువర్తనాలు చేశారు.
News February 26, 2026
ఏనుమాముల మార్కెట్‌లో ఉద్యోగుల బదిలీ

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను
అధికారులు అంతర్గత బదిలీలు చేశారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సూపర్వైజర్‌ను ఎనుమాముల మార్కెట్ లోని పల్లి, పత్తి యార్డుకు బదిలీ చేశారు. అలాగే అపరాలు, ధాన్యం, మిర్చి తదితర యార్డుల సూపర్వైజర్లకు అంతర్గత బదిలీలు చేశారు. ఈ అంతర్గత బదిలీలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.


