News March 26, 2024

MDK: ఒంటరిగా వెళ్లేవారే వీరి TARGET.. జర జాగ్రత్త!

image

ఒంటరిగా వెళుతున్న వారే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేశారు. CI ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు.. పటాన్‌చెరులో ఉంటున్న ఏడుగురు సభ్యుల ముఠా ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీలకు పాల్పడుతోంది. సోమవారం ఇంద్రేశం వద్ద ORR సర్వీస్ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పారిపోతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News September 8, 2025

మెదక్: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత

image

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో మెదక్ నియోజకవర్గ నేతకు చోటు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత సోమశేఖర్ రావు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిణిత గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.

News September 8, 2025

మెదక్: ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యమైంది: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం 1052 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ అమూల్యమైనదని పేర్కొంటూ, ఓటరు జాబితాపై చర్చించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటరు జాబితాలో ఖచ్చితంగా ఉండాలని తెలిపారు.

News September 8, 2025

మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలు నేరుగా ఎస్పీ దృష్టికి తెచ్చారు. పరిష్కారం చేసే వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి నేరుగా రావాలన్నారు.