News April 3, 2025
ఆసిఫాబాద్: KU.. గడువు మరోసారి పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News April 5, 2025
TODAY HEADLINES

AP: బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు: CM చంద్రబాబు
TG: జీవన ప్రమాణాలు పెరిగే విధంగా విద్యావ్యవస్థ ఉండాలి: CM రేవంత్
వక్ఫ్ బిల్లుతో అన్యాయం, అవినీతి అంతం: అమిత్ షా
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
AP: తల్లిపై కేసు వేసిన కొడుకుగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: షర్మిల
AP: నా పోటీ సీఎం చంద్రబాబుతోనే: లోకేశ్
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. రూ.11Cr సంపద ఆవిరి
News April 5, 2025
BREAKING: APPSC గ్రూప్ 2 ఫలితాలు విడుదల

AP: ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రిజల్ట్స్‌తోపాటు ఎగ్జామ్ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేసింది. కీని APPSC వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సెలెక్ట్ చేసింది. స్పోర్ట్స్ కోటాతో సహా మొత్తం 2,517 మందిని ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వీరందరికి త్వరలోనే కాల్ లెటర్లు పంపనుంది.
News April 5, 2025
MDCL: జిల్లాలో 17.3 లక్షల మందికి రేషన్ బియ్యం..!

మేడ్చల్ జిల్లాకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన మరో రిపోర్టును Way2News సేకరించింది. నేటి వరకు జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 5,30,590కు చేరిందని, దీంతో 17,37,600 మందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందుతుందని ఇన్‌ఛార్జి DCSO సుగుణ బాయి తెలిపారు. కులగణన ప్రకారం 12,243 దరఖాస్తులు రాగా, తాజాగా 6,818 రేషన్ కార్డులు జారీ అయ్యాయి.