News April 3, 2025

MNCL: KU.. గడువు మరోసారి పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Similar News

News April 5, 2025

సీఎం రేవంత్‌ రెడ్డికి జాన్ అబ్రహం రిక్వెస్ట్

image

కంచ గచ్చిబౌలి వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం స్పందించారు. ఆ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను నిలిపివేయాలని CM రేవంత్‌ని కోరారు. HYDకు ఆక్సిజన్ అందిస్తున్న 400 ఎకరాల అడవిలో ఎన్నో వణ్యప్రాణులు ఉన్నాయని, వేలాది చెట్లను కొట్టి వాటికి గూడు లేకుండా చేయొద్దని ట్వీట్ చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం దీన్ని వ్యతిరేకించారు. అటు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు కొట్టొద్దని ప్రభుత్వాన్ని SC ఆదేశించింది.

News April 5, 2025

మ‌రింత మెరుగ్గా అన్న క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌: క‌లెక్ట‌ర్

image

జిల్లాలోని మూడు అన్న క్యాంటీన్ల‌కు రాష్ట్ర‌స్థాయిలో మెరుగైన ర్యాంకులు ల‌భించ‌డం ప‌ట్ల అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్క‌ర్ శుక్రవారం అభినందించారు. వీటి నిర్వ‌హ‌ణ‌ను మ‌రింతగా మెరుగుప‌రిచి, ప్ర‌జ‌ల‌కు రుచిక‌రంగా, నాణ్య‌మైన భోజ‌నాన్ని, అల్పాహారాన్ని అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. జిల్లాలోని అన్ని అన్న‌ క్యాంటీన్లు ఈ ఘనత సాధించాలని ఆకాంక్షించారు.

News April 5, 2025

TODAY HEADLINES

image

AP: బర్డ్‌ ఫ్లూపై ఆందోళన వద్దు: CM చంద్రబాబు
TG: జీవన ప్రమాణాలు పెరిగే విధంగా విద్యావ్యవస్థ ఉండాలి: CM రేవంత్
వక్ఫ్ బిల్లుతో అన్యాయం, అవినీతి అంతం: అమిత్ షా
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
AP: తల్లిపై కేసు వేసిన కొడుకుగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: షర్మిల
AP: నా పోటీ సీఎం చంద్రబాబుతోనే: లోకేశ్
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. రూ.11Cr సంపద ఆవిరి

error: Content is protected !!