News April 3, 2025

అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తి

image

అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం టిడి బంజరలో షార్ట్ సర్క్యూట్ కారణంగా <<15975525>>అగ్నిప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో రెండు ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఓ ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) మంటలు అంటుకొని సజీవదహనం అయ్యాడని స్థానికులు చెప్పారు. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. పంచాయతీ ట్రాక్టర్‌తో మంటలను అదుపు చేశామన్నారు.

Similar News

News January 7, 2026

విజయవాడ: పిల్లల విక్రయాల కేసులో ఇద్దరు అరెస్ట్

image

విజయవాడలో సంచలనం సృష్టించిన శిశువుల విక్రయాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితురాలు సరోజినీ వెల్లడించిన వివరాలతో ముంబయికి చెందిన కవిత, ప్రతాప్ జాదవ్ అనే మరో ఇద్దరు నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై వీరిని విజయవాడ తరలించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ ముఠాలోని మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

News January 7, 2026

HNK: ప్రోత్సాహకానికి నిరీక్షణ!

image

కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ. 2.50 లక్షల వరకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నా, జిల్లాలో అమల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. 400 మందికి పైగా జంటలు దరఖాస్తు చేసుకోగా, 111 మందికే నిధులు మంజూరు కావడం గమనార్హం.ప్రభుత్వం రూ. 2.77 కోట్లు విడుదల చేసినప్పటికీ, ఇంకా వందలాది మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా నిధులు అందకపోవడంతో ఆదర్శ జంటలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి.

News January 7, 2026

BNGR: రుణమాఫీపై హైకోర్టును ఆశ్రయించిన రైతు

image

ప్రభుత్వ రుణమాఫీ అమలుపై వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి చెందిన నరసింహ రెడ్డి అనే రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరూర్ కెనరా బ్యాంకులో తాను తీసుకున్న రూ.1.50 లక్షల రుణం మాఫీ కాలేదని ఆయన పేర్కొన్నారు. రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం జీవో 567 జారీ చేసినప్పటికీ, తనకు ఆ ఫలాలు అందలేదని ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టును కోరారు.