News April 3, 2025

NRPT: గ్రూప్ -1 ర్యాంకర్లను సన్మానించిన ఎండీ

image

నారాయణపేట ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న కార్మికుల పిల్లలు ఇటీవల విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో ప్రతిభ చూపారు. కండక్టర్ శ్రీనివాసులు కూతురు వీణ డిప్యూటీ కలెక్టర్గా, వహీద్ కూతురు ఫాతిమినా ఫైజ్ డీఎస్పీలుగా ఎంపికయ్యారు. వారిని ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ HYDలోని తన కార్యాలయంలో శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించి అభినందించారు. తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన పేరెంట్స్‌ను అభినందించారు.

Similar News

News September 19, 2025

ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

image

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

News September 19, 2025

పెద్దపల్లి: మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా మధు

image

పెద్దపల్లి జిల్లా జాతీయ మాల మహానాడు అధ్యక్షుడిగా కట్టేకోల మధుని నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఆముల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోచం మల్లయ్య, ఉపాధ్యక్షులుగా మద్దెల రామకృష్ణ, మట్ట రాజయ్య, కార్యదర్శులుగా చెవుల రాజయ్య, బండ రాజులను నియమించారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపార

News September 19, 2025

క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

image

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌‌ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.