News April 3, 2025

కామారెడ్డి: ముగిసిన పది పరీక్షలు.. జాగ్రత్త

image

నిన్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు.

Similar News

News April 5, 2025

NZB: కత్తి దాడి.. ముగ్గురి అరెస్ట్

image

నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సౌత్ రూరల్ సీఐ సురేశ్ తెలిపారు. నగరంలోని ఆరో టౌన్ పరిధిలో అక్బర్ కాలనీ కెనాల్ కట్టలో ఇటీవల కత్తి పోట్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన ఆరిఫ్ ఖాన్, సోహెల్ ఖాన్, షేక్ పర్వేజ్‌లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ వివరించారు.

News April 5, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 5, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
ఇష: రాత్రి 7.43 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 5, 2025

MHBD: 100% టీకాల అందజేత పూర్తి చేయాలి: DMHO

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విస్తృత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మైక్రో యాక్షన్ ప్లాన్ అవగాహన సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO రవి మాట్లాడుతూ.. సూపర్వైజర్స్, స్టాఫ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలన్నారు.

error: Content is protected !!