News April 3, 2025
విజయవాడ: మహిళ హత్య.. నిందితుడి అరెస్ట్

పటమటలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటమట పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి అనే మహిళ తన భర్తతో కలిసి కాగితాలు ఏరుకొని జీవనం సాగించేది. వాంబే కాలనీకి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మిని శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. ఒప్పుకోకపోవడంతో మంగళవారం రాత్రి మద్యం తాగి విచక్షణారహితంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు.
Similar News
News January 13, 2026
ఇరాన్ నిరసనలు.. ఇతడికే తొలి ‘ఉరి’..!

సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే 650మందిని పోలీసులు కిరాతకంగా కాల్చి చంపారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిలో భయం పుట్టించేందుకు నియంతృత్వ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సొల్తానీని రేపు ఉరి తీసేందుకు రంగం సిద్ధంచేసింది. దీంతో మానవహక్కుల ఉద్యమకారులు SMలో అతడికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
News January 13, 2026
పాదాల అందం కోసం

మన శరీరంలోనే భాగమైన పాదాల సంరక్షణను అంతగా పట్టించుకోం. దీని వల్ల మడమలకు పగుళ్లు వచ్చి తీవ్రంగా బాధిస్తాయి కూడా. కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. * పాదాల పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది. * ఓట్‌మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. వారానికోసారి ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.
News January 13, 2026
భక్తుల్లా వచ్చి బాసరలో విజిలెన్స్ తనిఖీలు

బాసర ఆలయంలో విజిలెన్స్ అధికారులు 2 రోజుల నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. సామాన్య భక్తులుగా వచ్చి క్షేత్రస్థాయిలో తమదైన శైలిలో విచారణ నిర్వహించారు. నూతన EO ఆఫీస్, TTD వంద గదుల మరమ్మతు పనులకు రూ.కోట్లలో డబ్బులు వెచ్చించడం వెనుక అంతర్యం ఏంటని ఆరా తీశారు. లడ్డూ కౌంటర్, తయారీ కేంద్రం నాణ్యత ప్రమాణాలు, అన్నదానం వివరాలను సేకరించారు. 2 రోజుల్లో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు.


