News April 3, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

బహుజన ఆత్మగౌరవ ప్రతీక, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, దురాగతలపై తిరగబడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 5, 2025
NZB: కత్తి దాడి.. ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సౌత్ రూరల్ సీఐ సురేశ్ తెలిపారు. నగరంలోని ఆరో టౌన్ పరిధిలో అక్బర్ కాలనీ కెనాల్ కట్టలో ఇటీవల కత్తి పోట్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన ఆరిఫ్ ఖాన్, సోహెల్ ఖాన్, షేక్ పర్వేజ్‌లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ వివరించారు.
News April 5, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 5, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
ఇష: రాత్రి 7.43 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 5, 2025
MHBD: 100% టీకాల అందజేత పూర్తి చేయాలి: DMHO

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విస్తృత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మైక్రో యాక్షన్ ప్లాన్ అవగాహన సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO రవి మాట్లాడుతూ.. సూపర్వైజర్స్, స్టాఫ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలన్నారు.