News April 3, 2025
PDPL: మహనీయుల జయంతోత్సవాల సన్నాహక సమావేశం

ఈనెల 5న మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్, 14న అంబేద్కర్ జయంతోత్సవాల నిర్వహణకు సంబంధించి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ SC-విభాగంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా విజిలెన్స్& మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మహనీయుల జయంతోత్సవాల ఏర్పాట్ల గురించి చర్చించారు. ప్రతినిధులు బొంకూరి మధు, మామిడిపల్లి బాపయ్య, సదయ్య, రాజేశం, కృష్ణయ్య, బాల అంకుష్, లింగయ్య, కాంతయ్య, నారాయణ ఉన్నారు.
Similar News
News September 19, 2025
క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.
News September 19, 2025
తలమడుగు: కలప అక్రమ రవాణా

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాపూర్ సమీపంలోని MS గార్డెన్‌లో సిబ్బంది తనిఖీలు చేశారు. రూ.84 వేల విలువైన టేకు కలప దొరికినట్లు చెప్పారు. కలపను జప్తు చేసి యజమాని మొహమ్మద్ మూసా, లక్షణ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
News September 19, 2025
SRPT: ‘సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించాలి’

భూ భారతి చట్టం అమలులో భాగంగా సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి నోటీసులు జారీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కే.సీతారామారావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో రెవెన్యూ అంశాలపై ఆయన వెబ్‌ఎక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు, తహశీల్దార్లతో పాటు ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ సాయి గౌడ్, డీటీ వేణు తదితర అధికారులు పాల్గొన్నారు.