News April 3, 2025

సరుబుజ్జిలి: నాలుగు నెలల్లో 4 ఉద్యోగాలు

image

సరుబుజ్జిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన వాకముల్లు రమణమూర్తి కుమారుడు బాలమురళి B.TECH పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. 2025 సంవత్సరంలో విడుదలైన రూరల్ బ్యాంక్(RRB) PO, క్లర్క్ ఫలితాల్లో ఉత్తీర్ణుడై చైతన్య గోదావరి బ్యాంక్‌లో పీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన IBPS క్లర్క్, RPF ఎస్ఐగానూ కూడా ఎంపికయ్యారు. 4 ఉద్యోగాలు సంపాదించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 12, 2026

శ్రీకాకుళం: జనరల్ బోగీలతో ప్రత్యేక రైలు..ఈ నెల18 వరకే ఛాన్స్

image

సంక్రాతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల12-18 వరకు జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వాల్టేర్ డివిజన్ సీనియర్ డీసీ పవన్ కుమార్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-విజయవాడ(08567-68) ట్రైన్ విశాఖలో ఉదయం 10గం.లకు బయలుదేరి సాయంత్రం 4గం.టలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ-విశాఖ మధ్య సాయంత్రం 6.30. గంలకు ప్రారంభమై అర్ధరాత్రి12.30 గం.ల వరకు నడవనుంది.

News January 12, 2026

శ్రీకాకుళం: UTF రాష్ట్ర కార్యదర్శిగా కిషోర్ కుమార్

image

ఏపీ ఐక్య టీచర్ ఫెడరేషన్ (యూటీఎఫ్ )రాష్ట్ర కార్యదర్శిగా శ్రీకాకుళానికి చెందిన కిషోర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఈయనను ఎంపిక చేశారు. గత కొన్నేళ్లుగా కిషోర్ కుమార్ టీచర్ల సమస్యలపై పనిచేస్తున్నారు. వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఉపాధ్యాయ ఉద్యమానికి అంకితమై, యూటీఎఫ్ అభివృద్ధికి విశేషంగా కృషి చేయడంతో మూడోసారి ఎన్నుకున్నారు.

News January 12, 2026

EEMT–2026 రిజల్ట్స్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ర్‌గా సిక్కోలు విద్యార్థి

image

ఎడ్యుకేషనల్ ఎపిఫనీ (Educational Epiphany) సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 27 న నిర్వహించిన EEMT–2026 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఆదివారం ఆ సంస్థ కన్వీనర్ పుట్టం రాజు శ్రీరామచంద్ర మూర్తి అధికారికంగా ప్రకటించారు. 10వ తరగతిలో టెక్కలి మండలం సీతాపురం జడ్పీ హెచ్ పాఠశాల విద్యార్థి సకలభక్తుల భరత్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని హెచ్.ఎం పద్మావతి నిన్న తెలియజేశారు. విద్యార్థిని అభినందించారు.