News April 3, 2025

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ 

image

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు “30 పోలీస్ ఆక్ట్” అమల్లో ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

Similar News

News July 7, 2025

భద్రాద్రి: పంట పొలాలకు వెళ్లాలంటే సాహసమే.!

image

జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు అధ్వానంగా తయారవుతున్నాయి. ప్రధాన రహదారుల పరిస్థితే ఇలా ఉంటే పంట పొలాలకు వెళ్లే రోడ్లు ఎలా ఉంటాయో ఊహకే అందనట్లు కనిపిస్తున్నాయి. దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలో పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు, వ్యవసాయ కూలీలు గుంతల దారిలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దారుల్లో ఎరువుల బస్తాలు ఎలా తీసుకెళ్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరం అయినా పోయాలని కోరుతున్నారు.

News July 7, 2025

నిజామాబాద్: ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.

News July 7, 2025

మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీవో స్వాతి, తదితరులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.