News April 3, 2025
MBNR: ముగిసిన పరీక్షలు.. పిల్లలపై కన్నేసి ఓ ఉంచండి!

నిన్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. SHARE IT.
Similar News
News July 7, 2025
తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జులు

* ఖమ్మం- వంశీచంద్ రెడ్డి, * మెదక్- పొన్నం ప్రభాకర్
* నల్గొండ- సంపత్ కుమార్
* వరంగల్- అడ్లూరి లక్ష్మణ్
* హైదరాబాద్- జగ్గారెడ్డి
* మహబూబ్‌నగర్- కుసుమకుమార్
* ఆదిలాబాద్- అనిల్ యాదవ్
* కరీంనగర్- అద్దంకి దయాకర్
* నిజామాబాద్- హుస్సేన్
* రంగారెడ్డి- శివసేనారెడ్డి
News July 7, 2025
కిలోకు రూ.12 చెల్లించి మామిడి కొనుగోళ్లు

AP: మద్దతు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రస్తుతం కేజీకి రూ.8 చెల్లిస్తుండగా, ప్రభుత్వం అదనంగా రూ.4 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిలో మామిడికి రూ.12 చెల్లిస్తున్నారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 3.08 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్ల వారు కొనుగోలు చేశారు.
News July 7, 2025
పాశ మైలారం: ఆచూకీ తెలియని 8 మంది వివరాలు

పాశ మైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. వెంకటేశ్, రవి, రాహుల్, విజయ్, ఇర్ఫాన్, అఖిలేశ్, జస్టిన్, శివాజీ ఆచూకీ లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. వీరి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పటాన్‌చెరులోనే పడిగాపులు కాస్తున్నారు.