News April 3, 2025
బొల్లాపల్లి: కన్న తల్లిని హతమార్చిన కొడుకు

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 5, 2025
నాగర్‌కర్నూల్: ‘మా జీతాలు మాకివ్వండి’

పెండింగ్‌లో ఉన్న కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణమ్మ, రాధ, బాలమణి, రేణుక, సంతోష, లక్ష్మి, శ్రీదేవి ఉన్నారు.
News April 5, 2025
రిషభ్ పంత్ మళ్లీ ఫెయిల్

LSG కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. వరుసగా నాలుగో మ్యాచులోనూ ఆయన సత్తా చాటలేకపోయారు. ముంబైతో మ్యాచులో 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. 4 మ్యాచుల్లో కలిపి పంత్ 19 పరుగులే చేశారు. దీంతో ఆయనపై SMలో మాజీలు, విశ్లేషకులు, క్రికెట్ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా IPL మెగా వేలంలో పంత్ రూ.27 కోట్లు పలికి ఖరీదైన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.
News April 5, 2025
ములుగు: ధాన్యం సేకరణపై అడిషనల్ కలెక్టర్ సమీక్ష

రబి 2024-25 కాలానికి సంబంధించి ధాన్యం సేకరణ కొరకు ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ ధాన్యం సేకరణలో అందరు రైస్ మిల్లర్లు పాల్గొనాలని ఆదేశించినారు. 7 బాయిల్డ్ మిల్లుల్లో ధాన్యం సేకరణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మిగతా రా రైస్ మిల్లర్స్ సైతం కొందరు ధాన్యం సేకరణలో పాల్గొంటారన్నారు.