News April 3, 2025

BREAKING.. గద్వాల: బాలుడి తల, మొండెం వేరైంది!

image

మల్దకల్ మండలంలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని నీలిపల్లిలో తల్లిదండ్రుల వెంట ఎనిమిదేళ్ల జీవన్ వరి పొలం దగ్గరికి వెళ్లాడు. వారు వరికోత యంత్రంతో పొలంలో పనులు చేయిస్తున్నారు. బాలుడు ఆడుకుంటూ మిషన్ దగ్గరికి వెళ్లడంతో.. అది ఆ బాలుడి మీది నుంచి వెళ్లింది. దీంతో బాలుడి తల, శరీరం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 16, 2025

ACS అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు.. అరెస్టు

image

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నూపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.కోటికి పైగా నగదు, రూ.కోటి విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూ సంబంధిత అంశాలలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో 6 నెలలుగా ఆమెపై ప్రత్యేక విజిలెన్స్ సెల్ నిఘా పెట్టినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

News September 16, 2025

పిల్లలకు డైపర్లు వేస్తున్నారా?

image

పిల్లలకు డైపర్లు వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. *2 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడొచ్చు *ఇంట్లో ఉన్నప్పుడు కాటన్‌వి, ప్రయాణాల్లో డిస్పోజబుల్ డైపర్లు వాడటం మేలు *డైపర్లను ఎక్కువసేపు మార్చకుండా వదిలేస్తే ఒరుసుకుపోవడం, గజ్జల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది *డైపర్ విప్పాక అవయవాలకు గాలి తగిలేలా ఉండాలి *గోరువెచ్చని నీళ్లతో కడిగేసి సున్నితంగా కాటన్ బట్టతో అద్దాక కొత్తది వేయాలి.

News September 16, 2025

సూర్యను నీరజ్ చోప్రా ఫాలో అవుతారా?

image

ఆసియా కప్‌ మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్‌కు భారత కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. ఇప్పుడు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి పడింది. రేపు, ఎల్లుండి టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ ఛాంపియన్, పాక్ ప్లేయర్ అర్షద్ నదీమ్‌ను నీరజ్ ఎదుర్కోనున్నారు. మరి షేక్ హ్యాండ్‌ విషయంలో SKYని భారత త్రోయర్ ఫాలో అవుతారా అనే చర్చ మొదలైంది.