News April 3, 2025
ఇండోనేషియాలో భూకంపం

ఆగ్నేయాసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నార్త్ హల్మహేరకు 121 కి.మీ. దూరంలో సముద్రంలో 42 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతాలు వణికిపోయాయి. 30 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు.
Similar News
News April 5, 2025
రిషభ్ పంత్ మళ్లీ ఫెయిల్

LSG కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. వరుసగా నాలుగో మ్యాచులోనూ ఆయన సత్తా చాటలేకపోయారు. ముంబైతో మ్యాచులో 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. 4 మ్యాచుల్లో కలిపి పంత్ 19 పరుగులే చేశారు. దీంతో ఆయనపై SMలో మాజీలు, విశ్లేషకులు, క్రికెట్ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా IPL మెగా వేలంలో పంత్ రూ.27 కోట్లు పలికి ఖరీదైన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.
News April 5, 2025
బాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్: అంబటి

AP: సీఎం చంద్రబాబుతో కలిసి PCC చీఫ్ షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. జగన్‌ను దెబ్బ తీయడానికే షర్మిలతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుంది. హోదా తీసుకురాలేదు. పోలవరాన్ని సర్వనాశనం చేశారు. లోకేశ్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకే కేంద్రంతో లాలూచీ పడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News April 5, 2025
ఏప్రిల్ 5: చరిత్రలో ఈరోజు

1908: స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ జననం
1950: త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రబోధానంద యోగీశ్వరులు జననం
1892: తెలుగు కవి పూతలపట్టు శ్రీరాములు రెడ్డి జననం
1942: తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ జననం
1993: నటి దివ్య భారతి మరణం
1974: ప్రముఖ సంగీత దర్శకుడు కోదండపాణి మరణం