News April 3, 2025

‘పల్నాడు జిల్లాకు మొదటి ప్లేస్’

image

రాష్ట్రంలో నే సొసైటీల కంప్యూటర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా సహకార శాఖ అధికారి ఎం.వెంకటరమణ అన్నారు. మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని సొసైటీలు గో లైవ్ లోకి వచ్చాయని వివరించారు. సభ్యులకుపారదర్శకంగా సేవలు అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీల సీఈఓలు, జిల్లా అధికారి వెంకటరాముడు కంప్యూటర్ రిజిస్ట్రేషన్ కోఆర్డినేటర్ అనిల్ రాజ్ కుమార్‌ను సన్మానించారు.

Similar News

News April 5, 2025

వనపర్తి: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: చిన్నారెడ్డి

image

వనపర్తి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏటీసీ తరగతులను నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన మెటీరియల్ ఇప్పటికే ఇక్కడికి చేరింది. ఏటీసీకి అవసరమైన విధంగా భవనాన్ని సిద్ధం చేయనున్నారు. ఈ పనులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. బోధన, అధ్యాపక బృందంతో ఆయన మాట్లాడారు.

News April 5, 2025

నాగర్‌కర్నూల్: ‘అమ్మాయిలు.. జర జాగ్రత్త..!’

image

యువతులు, మహిళలను వేధింపులకు గురిచేస్తే షీటీంకు ఫిర్యాదు చేయాలని షీటీం NGKL జిల్లా ఇన్‌ఛార్జి విజయలక్ష్మి సూచించారు. పెంట్లవెల్లి KGBVలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విజయలక్ష్మి మాట్లాడుతూ.. కొత్త పరిచయాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒంటరి ప్రయాణం పరిస్థితుల్లో మంచిది కాదని ఆమె సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోకిరీలు వేధిస్తే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.

News April 5, 2025

ADB: సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: DSP

image

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త పంథాలో సైబర్ నేరగాళ్ల మోసాలు చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే సమాచారం అందించాలని సూచించారు. టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు, సిబ్బంది, కాలనీవాసులు ఉన్నారు.

error: Content is protected !!