News April 3, 2025
VZM: ఈనెల 10 నుంచి ఉచిత కుట్టు శిక్షణ

విజయనగరం జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన అభ్యర్ధులకు ఈనెల 10వ తేదీ నుంచి నగరంలో ఉచిత కుట్టు శిక్షణ అందించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ గురువారం తెలిపారు. నాక్ ఆధ్వర్యంలో వీటీ అగ్రహారంలో నిర్వహిస్తున్న స్కిల్ హబ్‌లో ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. SC వర్గానికి చెందిన 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు, పురుషులు అర్హులని పేర్కొన్నారు.
Similar News
News April 5, 2025
మరింత మెరుగ్గా అన్న క్యాంటీన్ల నిర్వహణ: కలెక్టర్

జిల్లాలోని మూడు అన్న క్యాంటీన్లకు రాష్ట్రస్థాయిలో మెరుగైన ర్యాంకులు లభించడం పట్ల అధికారులను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ శుక్రవారం అభినందించారు. వీటి నిర్వహణను మరింతగా మెరుగుపరిచి, ప్రజలకు రుచికరంగా, నాణ్యమైన భోజనాన్ని, అల్పాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని అన్ని అన్న క్యాంటీన్లు ఈ ఘనత సాధించాలని ఆకాంక్షించారు.
News April 5, 2025
పండ్ల వర్తకులకు విజయనగరం జేసీ హెచ్చరిక

రసాయనిక పదార్థాలు వినియోగించి పళ్లను కృత్రిమంగా పండించి విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తామని విజయనగరం జేసీ ఎస్.సేతుమాధవన్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోని JC ఛాంబర్లో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. కృత్రిమంగా పండించే పండ్లు తక్కువ రుచితో వుంటాయన్నారు. ప్రజలకు విస్తృత అవగాహన చేపట్టాలని సూచించారు.
News April 4, 2025
VZM: క్వారీలో జారిపడి కార్మికుడు మృతి

వేపాడ మండలం వీలుపర్తి క్వారీ వద్ద ప్రమాదవశాత్తు జారిపడి క్వారీ కార్మికుడు చింతల సత్తిబాబు (54) శుక్రవారం మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చర్లపాలెంకు చెందిన సత్తిబాబు క్వారీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. క్వారీలో పని చేస్తుండగా శుక్రవారం ఉదయం జారీపడడంతో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.