News April 3, 2025
HCU విద్యార్థులపై కేసులను ఎత్తివేస్తాం: భట్టి

TG: HCUకు సంబంధించిన భూమిని ఇంచుకూడా ప్రభుత్వం తీసుకోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఢిల్లీలో తెలిపారు. వారిపై దుందుడుకుగా వ్యవహరించవద్దని పోలీసులను ఆదేశించారు. గతంలో బిల్లీరావుకు చంద్రబాబు అప్పనంగా 400 ఎకరాలు కట్టబెడితే నాటి సీఎం వైఎస్సార్ ఆ భూములను కాపాడారని చెప్పారు.
Similar News
News April 5, 2025
BREAKING: పపువా న్యూగినియాలో భారీ భూకంపం

పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది. యూఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం 49 కి.మీ లోతున ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంట వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 3000 మంది మరణించిన విషయం తెలిసిందే.
News April 5, 2025
టాప్‌లోనే కొనసాగుతోన్న PBKS

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ టాప్‌లోనే కొనసాగుతోంది. మరోవైపు పట్టికలో అట్టడుగున సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆ తర్వాత RCB, KKR, LSG, MI, CSK, RR, SRH ఉన్నాయి. ఇవాళ రెండు మ్యాచులు ఉండటంతో టేబుల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.
News April 5, 2025
దాడులు ఆపకపోతే బందీల ప్రాణాలకే ముప్పు: హమాస్

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలకే ప్రమాదమని హమాస్ తెలిపింది. తాము ఇజ్రాయెల్‌కు బందీలను అప్పగించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ఆర్మీ పాలస్తీనియన్లను గాజా నుంచి బలవంతంగా ఇక్కడి నుంచి తరలిస్తోందని ఆరోపించింది. కాగా గాజాలో ఇంకా 59 మంది ఇజ్రాయెలీ బందీలు ఉన్నట్లు ఆ దేశం ప్రకటించింది. వారిని కాపాడేందుకు గాజాలో గ్రౌండ్ అఫెన్సివ్ ప్రారంభించింది.