News April 3, 2025
NGKL: పిడుగుపాటుకు చనిపోయింది వీళ్లే!

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో<<15978702>> పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే<<>>. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో వచ్చిన భారీ వర్షంలో పిడుగు పడటంతో మండలంలోని కండ్లకుంట ప్రాంతానికి చెందిన సుంకరి సైదమ్మ (35), వీరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 5, 2025
భువనగిరి: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం తుర్కపల్లి మండలంలోని దయ్య బండ తండాలో కురిసిన అకాల వర్షాలకు వరి చేలు, మామిడి తోటలు, కూరగాయల పంటలు, మిర్చి తోటలు నష్టపోయిన పంటలను పరిశీలించారు. చేతి కొచ్చిన పంటలు నష్టపోవడంతో రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.
News April 5, 2025
SRD: ఆరేళ్ల లోపు పిల్లలకు కంటి పరీక్షలు: DMHO

జిల్లాలో ఈనెల 7 నుంచి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శుక్రవారంలో తెలిపారు. వైద్య సిబ్బంది నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి కంటి వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.
News April 5, 2025
కల్వకుర్తి: WOW.. విత్తనాల ముగ్గు చూశారా..!

కల్వకుర్తి పరిధి కడ్తాల్ మండలం అస్మాన్‌పల్లిలో శుక్రవారం విత్తనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు వేడుకలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విత్తనాలతో వేసిన ముగ్గు అందరినీ ఆకట్టుకుంది. దేశంలోని నలుమూలల నుంచి వ్యవసాయ సంబంధిత శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతులు పాల్గొన్నారు. వేలాది విత్తనాలతో మొత్తం 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు.