News April 3, 2025
NGKL: పిడుగుపాటుకు చనిపోయింది వీళ్లే!

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో <<15978702>>పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే<<>>. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో వచ్చిన భారీ వర్షంలో పిడుగు పడటంతో మండలంలోని కండ్లకుంట ప్రాంతానికి చెందిన సుంకరి సైదమ్మ (35), వీరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 8, 2025
జన్నారం: ఐటీఐ పాసైన విద్యార్థులకు ఉద్యోగాలు

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మన్ పవర్ కంపెనీ, టామ్‌కామ్ సహకారంతో వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జన్నారం ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బండి రాములు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 8 జన్నారం ఐటీఐ కళాశాలలో 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఐటీఐ చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 8, 2025
విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం: 8వ తరగతి నుంచి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ లైబ్రరీ, రీడింగ్ రూమ్స్, మా పాప- మా ఇంటి మణిదీపం, సన్న బియ్యం, తదితర వాటిపై జిల్లా అధికారులతో సమీక్షించారు. గ్రామాలలో రీడింగ్ రూమ్స్ ఏర్పాటు, వాటి నిర్వహణకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
News April 8, 2025
రూ. రెండున్నర లక్షలు కొట్టేసి సారీ లెటర్ పెట్టాడు!

ఓ దుకాణంలో రూ.2.45 లక్షలు దోచుకున్న దొంగ, తనను క్షమించమంటూ ఓ లేఖ అక్కడ వదిలి వెళ్లాడు. ‘అప్పుల్ని తీర్చుకునేందుకు ఈ చోరీ చేస్తున్నా. రామనవమి రోజు చేస్తున్న ఈ దొంగతనానికి నన్ను క్షమించండి. నాకు కావాల్సినంత మాత్రమే తీసుకున్నా. 6 నెలల్లో తిరిగిచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయించుకోండి’ అని అందులో రాశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనీలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.