News April 3, 2025

YCP ఎంపీ మిథున్ రెడ్డికి షాక్

image

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకలు జరిగాయని, అందులో మిథున్ పాత్ర ఉందంటూ ఆయనపై కేసు నమోదైంది. దీంతో మిథున్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. దానిపై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం కుదరదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Similar News

News November 7, 2025

అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం

image

AP: నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID) అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్ అందించారు.

News November 7, 2025

ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కాంగ్రెస్సే: శ్రీధర్ బాబు

image

TG: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో ఓటర్లు BJP, BRSకు గుణపాఠం చెబుతారన్నారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

News November 7, 2025

కేంద్ర బలగాలతో ఉప ఎన్నిక నిర్వహించాలి: BRS

image

ECI అధికారులతో BRS MPలు సురేశ్ రెడ్డి, దామోదర్ రావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. CM, మంత్రులు అధికార దుర్వినియోగానికి, కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారని, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించాలన్నారు. స్త్రీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున మహిళా అధికారులను నియమించాలన్నారు.