News April 3, 2025
మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చే ప్రయత్నం: కాంగ్రెస్ MP

దేశంలో ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నాజిర్ హుస్సేన్ ఆరోపించారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 123 ఆస్తులపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. అసత్య ప్రచారాలతో దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Similar News
News April 5, 2025
BREAKING: పపువా న్యూగినియాలో భారీ భూకంపం

పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది. యూఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం 49 కి.మీ లోతున ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంట వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 3000 మంది మరణించిన విషయం తెలిసిందే.
News April 5, 2025
టాప్‌లోనే కొనసాగుతోన్న PBKS

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ టాప్‌లోనే కొనసాగుతోంది. మరోవైపు పట్టికలో అట్టడుగున సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆ తర్వాత RCB, KKR, LSG, MI, CSK, RR, SRH ఉన్నాయి. ఇవాళ రెండు మ్యాచులు ఉండటంతో టేబుల్‌లో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.
News April 5, 2025
దాడులు ఆపకపోతే బందీల ప్రాణాలకే ముప్పు: హమాస్

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలకే ప్రమాదమని హమాస్ తెలిపింది. తాము ఇజ్రాయెల్‌కు బందీలను అప్పగించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ఆర్మీ పాలస్తీనియన్లను గాజా నుంచి బలవంతంగా ఇక్కడి నుంచి తరలిస్తోందని ఆరోపించింది. కాగా గాజాలో ఇంకా 59 మంది ఇజ్రాయెలీ బందీలు ఉన్నట్లు ఆ దేశం ప్రకటించింది. వారిని కాపాడేందుకు గాజాలో గ్రౌండ్ అఫెన్సివ్ ప్రారంభించింది.