News April 3, 2025

ట్రంప్ టారిఫ్‌లు, చైనా ఆక్రమణలపై ఏం చెప్తారు?: రాహుల్

image

భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల అంశాన్ని LOP రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించారు. ‘ఈ టారిఫ్‌లపై కేంద్రం స్పందించాలి. ఈ సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అటు భారత్‌కు చెందిన 4వేల చ.కి.మీపైగా భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అక్కడి రాయబారి ద్వారా ఈ విషయం తెలిసిందని సంచలన ఆరోపణలు చేశారు.

Similar News

News April 5, 2025

BREAKING: పపువా న్యూగినియాలో భారీ భూకంపం

image

పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది. యూఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం 49 కి.మీ లోతున ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంట వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 3000 మంది మరణించిన విషయం తెలిసిందే.

News April 5, 2025

టాప్‌లోనే కొనసాగుతోన్న PBKS

image

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ టాప్‌లోనే కొనసాగుతోంది. మరోవైపు పట్టికలో అట్టడుగున సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆ తర్వాత RCB, KKR, LSG, MI, CSK, RR, SRH ఉన్నాయి. ఇవాళ రెండు మ్యాచులు ఉండటంతో టేబుల్‌లో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.

News April 5, 2025

దాడులు ఆపకపోతే బందీల ప్రాణాలకే ముప్పు: హమాస్

image

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలకే ప్రమాదమని హమాస్ తెలిపింది. తాము ఇజ్రాయెల్‌కు బందీలను అప్పగించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ఆర్మీ పాలస్తీనియన్లను గాజా నుంచి బలవంతంగా ఇక్కడి నుంచి తరలిస్తోందని ఆరోపించింది. కాగా గాజాలో ఇంకా 59 మంది ఇజ్రాయెలీ బందీలు ఉన్నట్లు ఆ దేశం ప్రకటించింది. వారిని కాపాడేందుకు గాజాలో గ్రౌండ్ అఫెన్సివ్ ప్రారంభించింది.

error: Content is protected !!