News April 3, 2025
పాలమూరు: ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పాలమూరు కురుమ సంఘం కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ.. గొర్రె కాపర్ల సామాజికవర్గానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని తెలిపారు. మాదారం కృష్ణ, ఎస్.వెంకటేశ్, కొల్లంపల్లి శ్రీనివాస్, రామచందర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 5, 2025
BREAKING: పపువా న్యూగినియాలో భారీ భూకంపం

పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది. యూఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం 49 కి.మీ లోతున ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంట వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 3000 మంది మరణించిన విషయం తెలిసిందే.
News April 5, 2025
భువనగిరి: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం తుర్కపల్లి మండలంలోని దయ్య బండ తండాలో కురిసిన అకాల వర్షాలకు వరి చేలు, మామిడి తోటలు, కూరగాయల పంటలు, మిర్చి తోటలు నష్టపోయిన పంటలను పరిశీలించారు. చేతి కొచ్చిన పంటలు నష్టపోవడంతో రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.
News April 5, 2025
SRD: ఆరేళ్ల లోపు పిల్లలకు కంటి పరీక్షలు: DMHO

జిల్లాలో ఈనెల 7 నుంచి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శుక్రవారంలో తెలిపారు. వైద్య సిబ్బంది నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి కంటి వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.