News April 3, 2025

నష్టాలతో ముగిసిన మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. US అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం మార్కెట్లపై పడింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంకోచించారు. సెన్సెక్స్ 322 నష్టంతో 76,295 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 23,250 వద్ద ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడవగా, TCS, టెక్ మహీంద్ర, HCL, ఇన్ఫోసిస్, ONGC షేర్లు నష్టాల్లో ముగిశాయి.

Similar News

News April 10, 2025

రేషన్‌లో రాగులు.. జూన్ నుంచి పంపిణీ

image

AP: వచ్చే జూన్ నుంచి రేషన్ షాపుల్లో రాగులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా అందించనుంది. ప్రతి నెలా 20 కేజీల బియ్యం తీసుకునే కుటుంబం 2 కేజీల రాగులు కావాలంటే ఆ మేరకు బియ్యాన్ని మినహాయిస్తారు. ఇందుకు ఏటా 25వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని అంచనా. ఆ మేరకు రాగుల సేకరణకు టెండర్ జారీ చేసింది.

News April 10, 2025

‘రామాయణం’లో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్

image

బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణం’ చిత్రంలో హనుమంతుడిగా నటిస్తున్నట్లు సన్నీ డియోల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అవును నేను హనుమంతుడి పాత్ర చేస్తున్నా. నటులుగా మేము సవాళ్లతో కూడిన పాత్రలను ఇష్టపడతాం. ఎందుకంటే అది సరదాగా ఉంటుంది. ప్రజలు మెచ్చేలా నేను ఆ పాత్రలో లీనమైపోతా. నేను ఇంకా షూటింగ్‌లో పాల్గొనలేదు. ఇది ఆల్ టైమ్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది’ అని ఆయన తెలిపారు.

News April 10, 2025

ALERT: రెండ్రోజుల పాటు వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. గంటకు 50 కి.మీ వేగం వరకూ ఈదురుగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

error: Content is protected !!