News April 3, 2025
కేంద్ర మంత్రిని కలిసిన వరంగల్ ఎంపీ

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని గురువారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. పలు ప్రాజెక్టులపై చర్చించి అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.
Similar News
News April 10, 2025
కాకినాడ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక

కాకినాడ జిల్లాలో గురువారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజుల నుంచి వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో రైతుల్లో గుబులు మొదలైంది.
News April 10, 2025
తాడేపల్లి: ఇప్పటంలో విషాదం.. ఇద్దరి చిన్నారుల దుర్మరణం

తాడేపల్లి (M) ఇప్పటంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం (D) అద్దంకి నుంచి పనికోసం ఓ కుటుంబం ఇక్కడికి వచ్చింది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ గోతిలో పడి చనిపోయారు. విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచి బాధిత కుటుంబం, చిన్నారుల మృతదేహాలను అద్దంకికి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు విచారణ చేపట్టారు.
News April 10, 2025
MNCL: ఉచిత సమ్మర్ కోచింగ్.. APPLY NOW

మే 1 నుంచి 31 వరకు ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపులకు పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తి రాజవీరు తెలిపారు. ఉదయం 6 నుంచి 8.30 వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.