News April 3, 2025
‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా NTR

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ రేపు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నట్లు ప్రకటించారు. తారక్ తన సినిమాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలియజేస్తూ నిర్మాత నాగవంశీ Xలో స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.
Similar News
News April 14, 2025
‘థగ్ లైఫ్’ పూర్తి.. KH237పై కమల్ ఫోకస్

మణిరత్నం డైరెక్షన్‌లో ‘థగ్ లైఫ్’ షూటింగ్ పూర్తవడంతో మరో చిత్రంపై కమల్ హాసన్ ఫోకస్ చేశారు. అన్బు-అరీవు దర్శకత్వంలో KH237 సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, జులై/ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం కమల్ తన బాడీ లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
News April 14, 2025
తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు

TG: 30 ఏళ్ల పాటు జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా నేడు రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని CM రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మరోవైపు, సుప్రీం తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఉత్తమ్ తెలిపారు.
News April 14, 2025
టూవీలర్లలో హీరో.. కార్లలో మారుతి

టూవీలర్ల అమ్మకాల్లో హీరో మోటార్స్ ఇండియాలో టాప్‌లో దూసుకెళ్తోంది. డీలర్స్ అసోసియేషన్ ఫాడా డేటా ప్రకారం 2024-25లో ఆ కంపెనీ 54లక్షల బైకులను విక్రయించింది. 48లక్షల వాహనాల విక్రయాలతో హోండా రెండో స్థానంలో ఉంది. అలాగే, కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ అగ్రస్థానంలో ఉంది. 2024-25లో సుమారు 16.72లక్షల కార్లను అమ్మింది. ఇదే కంపెనీ గతేడాది 16.08లక్షల వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ 2వ ప్లేస్ దక్కించుకుంది.